తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నటీమణులలో బాపు బొమ్మ ఎవరు అంటే చాలు టక్కున దివ్యవాణి అని చెప్పేస్తారు. అలాంటి ఆమె అందం.. నటన.. క్రేజ్ గురించి.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో ఎంతో మంది గుండెల్ని కొల్లగొట్టింది.
ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు తగ్గి రాజకీయాల వైపు అడుగులు వేసింది. దివ్య వాణి అసలు పేరు ఉషా వాణి. కన్నడలో డాన్స్ రాజా డాన్స్ మూవీ చేస్తున్నప్పుడు డైరెక్టర్ ద్వారకేష్ గారు తన పేరు దివ్య అని మార్చారట. అలా మొదట్లో కొన్ని మూవీస్ చేసిన దివ్య వాణికి పెద్దగా బ్రేక్ రాలేదు కానీ పెళ్లి పుస్తకంతో ఆమె కెరీర్ అలా టర్న్ ఐపోయింది. ఆ తర్వాత ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ మూవీస్ తో హ్యాట్రిక్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. బాపు గారి మూవీ అవకాశం రావడమే దేవుడి దయ అని చెప్పుకోవాలి. ముత్యమంతా ముద్దు షూటింగ్ టైంలో బాపు గారు తనను చూశారట. అలా ఆయన తన సినిమా స్టోరీ చెప్పడం దానికి తానూ ఓకే అనడం..అన్నీ అలా జరిగిపోయాయని చెప్పింది దివ్యవాణి. అలాంటి గొప్ప వ్యక్తి దొరకడం అదృష్టం అని అంది. బాపు గారి మూవీస్ లో తన ముందు జెనెరేషన్స్ వాళ్ళు, తర్వాతి జెనెరేషన్స్ వాళ్ళు కూడా చేసారు కానీ బాపుబొమ్మ అంటే తానే గుర్తొచ్చేలా తన పాత్రను రూపొందించడం నిజంగా ఆ విషయంలో చాలా లక్కీ అని చెప్పింది.
ఇప్పుడు బాపు బొమ్మ తన ఇంటి పేరుగా మారిపోయింది అని చెప్పుకొచ్చింది. చేసింది ఒక్క మూవీ ఐనా కూడా ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడా ఉన్నా కూడా తన పాత్రకు కనెక్ట్ అయ్యేలా చేసిన బాపు-రమణలకు ఒక ఇంటర్వ్యూలో ధన్యవాదాలు చెప్పింది. ఎక్కడ పెళ్లి జరిగినా పెళ్ళిపుస్తకంలోని సాంగ్ తప్పనిసరిగా ఉండాల్సిందే అనే సంతోషంగా చెప్పింది.